NZB: సిరికొండ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో సాంఘిక, హిందీ పాఠ్యాంశాలు బోధించేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేకాధికారి పర్వీన్ తెలిపారు. తాత్కాలిక ప్రాతిపదికన పని చేసేందుకు డిగ్రీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈరోజు నుంచి 4వ తేదీ వరకు ధ్రువపత్రాల జిరాక్స్లను పాఠశాలలో సమర్పించాలని కోరారు.