SRPT: హూజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేేడుకల్లో భాగంగా జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు అర్పించారు. చిన్నారులు పాటలు, నృత్యాలు, ఆటపాటలతో వేడుకలకు అందం చేకూర్చగా.. ఉపాధ్యాయులు బాలల హక్కులు, విద్య ప్రాముఖ్యతపై సందేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.