మెదక్: జిల్లాలో రెండు గంటల పాటు ఉప రాష్ట్రపతి పర్యటన ఉంటుందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో ఆయన ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 25న మధ్యాహ్నం 2:15 గంటల నుంచి 4:15 గంటల వరకు ఉప రాష్ట్రపతి పర్యటన ఉంటుందన్నారు. పోలీసు, వైద్య, ఆర్అండ్బీ, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.