సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన పిల్లలమర్రి ఎర్రకేశ్వర్యాలయం కార్తీక శోభతో కళకళలాడుతుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించగా, దీపాల కాంతులతో ఆలయం శోభాయమానంగా వెలిగిపోతుంది. భక్తులు శివ నామ స్మరణతో పరవశించి పోయారు.