KMR: బాన్సువాడలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విద్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పిల్లల వార్డును, NRC, DEIC విభాగాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. విజయ్ భాస్కర్‌తో కలిసి సందర్శించారు. సిబ్బందితో వైద్య సేవలపై సమీక్షించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. RMO డా. సుజాత, Dy.DMHO డా. రోహిత్ ఉన్నారు.