SRPT: నూతనకల్ మండల పరిధిలోని బిక్కుమల్ల గ్రామంలో గత వారం రోజుల కింద జరిగిన మహిళ మెడలోని మంగళసూత్రం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ నరసింహారావు, సీసీఎస్ సీఐ శివకుమార్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు.