SRD: దేశంలో అణగారిన వర్గాల హక్కుల కోసం నిర్విరామంగా పోరాడిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేడ్కర్ అని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ చరిత్రను రచించి, ప్రపంచం గర్వించదగిన మేధావి ఆయన అని పేర్కొంటూ కొనియాడారు.