MDK: చిన్నశంకరంపేట మండలం కామారం శివారులో లారీని బైకు ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దిరికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం తెల్లవారుజామున నార్సింగి మండలం శేరిపల్లి నుంచి చిన్నశంకరంపేట మండలంలోని ఓ పరిశ్రమలో పనిచేసేందుకు రాజు, వేణు బైకుపై వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కొరకు నార్సింగి ఆసుపత్రికి తరలించారు.