MBNR: జిల్లాలోని శ్రీనివాస కాలనీ పార్క్ వద్ద న్యూ పద్మాలయ స్కూల్లో రేపు సాయంత్రం 5 గంటలకు హిందూ సమ్మేళనం నిర్వహించనున్నారు. కుటుంబ వ్యవస్థ బలోపేతం, పర్యావరణ పరిరక్షణ, అంటరానితనం నిర్మూలనపై అవగాహన కల్పిస్తారు. ముఖ్య అతిథిగా శ్రీ భక్త సురేష్, వక్తగా శ్రీ లింగం సుధాకర్ రెడ్డి, మహిళా వక్తగా శ్రీమతి వంశీ లత హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.