MNCL: అనారోగ్యానికి గురైన నిరుపేదలకు కార్పోరేట్ వైద్య చికిత్సను అందించేందుకు CMRF పథకం వరంలా పనిచేస్తుందని కాంగ్రెస్ నాయకుడు నెల్లి రమేశ్ అన్నారు. బెల్లంపల్లి పట్టణం 12వ వార్డులో ఆదివారం లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మంజూరైన CMRF చెక్కులను పంపిణీ చేశారు. నిరుపేదల అభివృద్ధికి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు.