SDPT: లోక కళ్యాణార్థం శ్రీ రామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయాలని భక్తి రత్న జాతి అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. సోమవారం గజ్వేల్లో శ్రీ రామ రక్షా స్తోత్ర పుస్తకాలను స్థానిక కళాశాలలో పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు రామనామం విశిష్టత దాని గొప్పతనాన్ని తెలియజేశారు. ఇందులో ప్రిన్సిపాల్ కూడారి రాజు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అధ్యాపకులు ఉన్నారు.