వరంగల్: ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో లైసెన్స్ లేకుండా వాహనం నడిపి పట్టుబడ్డ ఆరుగురు వాహనదారులకు వరంగల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గుర్రపు వీరస్వామి 9000/- రూపాయల జరిమాన విధించారని వరంగల్ ట్రాఫిక్ సీఐ రామకృష్ణ శుక్రవారం రాత్రి తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 20 మందికి 28, 200/- రూపాయలు జరిమాన విధించారన్నారు.