PDPL: సింగరేణి కార్మికుల హక్కుల రక్షణ, హామీల అమలు, నూతన గనుల రక్షణకై ఏఐటీయూసీ ఐక్య ఉద్యమాలకు ముందుకు రావాలని జీఎల్బీకేఎస్ గౌరవ సలహాదారు టీ. శ్రీనివాస్ కోరారు. ఆదివారం గోదావరిఖనిలో జీఎల్బీకేఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ.కృష్ణ అధ్యక్షతన జరిగింది. గుర్తింపు సంఘంగా కార్మికులకు హామీలను అమలు చేయించాల్సిన బాధ్యత ఏఐటీయూసీపై ఉందన్నారు.