SRD: అంబేద్కర్ స్టడీ సర్కిల్ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డికి సంఘం సభ్యులు శుక్రవారం సంగారెడ్డిలో వినతిపత్రం సమర్పించారు. అంబేద్కర్ వాదులు సొంత డబ్బులతో స్టడీ సర్కిల్ నడిపిస్తున్నారని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. సంస్థ అభివృద్ధికి సహకరిస్తే నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉచితంగా కోచింగ్ ఇస్తామని చెప్పారు.