MDK: జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో మాత్రమేకాక రెవెన్యూ డివిజన్, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లోనూ ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రకటించారు. సోమవారం నుంచి ఈ కార్యక్రమం పూర్తిగా ప్రారంభమై, రేగోడు మండల కేంద్రంలో కలెక్టర్ వ్యక్తిగతంగా ప్రజావాణి సమావేశానికి హాజరుకానున్నారు అని తెలిపారు.