ELR: ఈనెల 7న పోలవరంలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు భద్రత చర్యలను పరిశీలించారు. సోమవారం ప్రాజెక్టు ప్రాంతంలో కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ సోమవారం పర్యటించారు. సీఎం పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఎస్పీ మరియు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.