నటి రాశికి అనసూయ క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియాలో తాజాగా ఓ పోస్టు పెట్టింది. ఇటీవల మహిళల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దానిపై స్పందిస్తూ రాశి ఓ వీడియో విడుదల చేశారు. ఓ టీవీ కార్యక్రమంలో తనను కించపరిచేలా మాట్లాడారంటూ అనసూయ పేరు ఎత్తకుండానే ఆమె మండిపడ్డారు. ఈ క్రమంలో అనసూయ స్పందిస్తూ రాశికి క్షమాపణ చెప్పింది.