KKD: ఈ ఏడాది సంక్రాంతి వేడుకలను జగ్గంపేట నియోజకవర్గం వైభవంగా నిర్వహించడానికి అధికారులతో జగ్గంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే నెహ్రూ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంబరాలు జనవరి 12వ తేదీ సోమవారం స్థానిక సెంటర్ పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించడానికి నిశ్చయించారు. తెలుగుదనం ఉట్టిపడేలా సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తామన్నారు.