KMM: రైతాంగంపై మోదీ సర్కార్ కక్షపూరిత వైఖరి అవలంభిస్తుందని, మిగిలిన రంగాలతో పోల్చినప్పుడు వివక్షతను ప్రదర్శిస్తుందని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు బాగం హేమంతరావు తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ఖమ్మం పెవిలియన్ మైదానం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో అయన మాట్లాడారు.