MBNR: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించుకోవాలంటే పోరాటాలు తప్పవని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్ అన్నారు. చాయ్ చర్చ కార్యక్రమంలో భాగంగా భూత్పూర్ మండల కేంద్రంలో వివిధ కుల సంఘ ప్రతినిధులు, మేధావులు బీసీ నాయకులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో విశ్రాంత డీఈవో విజయకుమార్, మేధావి వర్గం నాయకులు జుర్రు నారాయణ యాదవ్ పాల్గొన్నారు.