KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగాల నుంచి మంగళవారం 930 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్ట్ ఏఈఈ సాకేత్ తెలిపారు. దీంతో పంటసాగు కోసం ప్రాజెక్టు ప్రధాన కాలువద్వారా 1,800 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం14.673 టీఎంసీల నీటినిల్వ ఉన్నట్లు వివరించారు.