KMM: ఖమ్మం గొల్లగూడెం మసీదు సెంటర్లో సోమవారం ముస్లింలు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లు మైనార్టీలకు అన్యాయం చేసే విధంగా ఉందని ముస్లిం మత పెద్దలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న ముస్లింలను అణిచివేసే ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. తక్షణమే వక్ఫ్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.