HYD: నగరంలో వివిధ కేసుల్లో ప్రమేయం ఉన్న రౌడీ షీటరు స్పెషల్ జోనల్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వివరాలు.. చాంద్రాయణగుట్టకు చెందిన రౌడీ షీటర్ ఇష్టకార్ (30)పై నగరంలోని పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో అతడిని ప్రణాళిక వేసి స్పెషల్ జోనల్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ కోసం నిందితుడిని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.