NZB: రూ.2 వేల కోసం ఒక వ్యక్తిపై మరో వ్యక్తి దాడికి పాల్పడినట్లు 3వ టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. ఈ నెల 21న గౌతనగర్కు చెందిన చందు, దుబ్బకు చెందిన గంగ ప్రసాద్, మరో వ్యక్తి కలిసి మద్యం తాగారు. గంగ ప్రసాద్ జేబులో రూ.2,000 నగదు ఉండటంతో చందు, గంగ ప్రసాద్‌ను డబ్బు ఇవ్వమని అడగగా గంగ ప్రసాద్ లేవని చెప్పాడు. చందు, గంగ ప్రసాద్‌పై దాడి చేసి పారిపోయాడు.