MNCL: ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో ఈనెల 7న అండర్-19 కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు మంచిర్యాల DIEO అంజయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ చదువుతున్న 19 ఏళ్లలోపు విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం SGF సెక్రటరీ బాబురావును సంప్రదించాలని సూచించారు.