GDWL: మల్దకల్ మండలం చర్ల గార్లపాడు గ్రామంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ కారణంగా పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుడు నరసింహులు సోమవరం ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో వర్షపు నీరు, మురుగునీరు నేరుగా పేదల గుడిసెల్లోకి వచ్చి ఆరోగ్య సమస్యలకు దారితీస్తోందని పార్టీ నాయకులు మండిపడ్డారు.