NRML: ముధోల్ సమీపంలోని విఠోలి–ముధోల్ రహదారిపై బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, థార్ కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో కారు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు ప్రయాణికులకు ఎటువంటి గాయాలు జరగలేదు. ఘటన స్థలాన్ని ముధోల్ ఎస్సై బిట్ల పెర్సిస్, భైంసా డీఎం హరిప్రసాద్ పరిశీలించారు.