కరీంనగర్ జిల్లా కార్యాలయంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షన్ సమస్య, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యం, ఉద్యోగులపై జరుగుతున్న దాడులు, 317 జీవో ప్రభావం వంటి అనేక కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కార్యదర్శి సంగేం లక్ష్మణరావు పాల్గొన్నారు.