JGL: మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామస్థులు ఎల్లమ్మ ఆలయం వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు. గత కొద్దిరోజుల క్రితం ఆలయాన్ని ఎండోమెంట్లో కలపారు. దీంతో ఆలయాన్ని ఎండోమెంట్లో కలుపొద్దంటూ ఆలయం ముందు ప్రతి మంగళవారం ఆందోళన చేస్తున్నారు. దీంతో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు నిర్వహించారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు కొంత వాగ్వాదం చోటు చేసుకుంది.