MLG: మల్లంపల్లి మండల కేంద్రంలోని రామచంద్రపురం గ్రామంలో నూతనంగా శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయాన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలో ఇవాళ మహబూబాబాద్ పార్లమెంటు సభ్యుడు పోరిక బలరాం నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాల్సిందిగా అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.