JGL: ఎండపల్లి మండలంలో ఈనెల 17న జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ఖర్చుపై పరిమితులు విధించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యయ పరిశీలకుడు మల్లపుల మనోహర్ బుధవారం గుల్లకోట రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగానే ఖర్చు చేసి, లెక్కలు సమర్పించాలని సూచించారు.