MNCL: నిరుపేదల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సీపీఎం దండేపల్లి మండల కార్యదర్శి కనికారపు అశోక్ కోరారు. గురువారం దండేపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామంలో సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘం కమిటీల సమావేశం నిర్వహించారు. గ్రామంలో అర్హులైన పేదలకు పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదల పక్షాన సీపీఎం పోరాడుతుందని కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఉన్నారు.