ADB: సంక్రాంతి పండగ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీ సంస్థకు రూ. 1.27 కోట్ల ఆదాయం వచ్చిందని సంస్థ రీజినల్ మేనేజర్ భవాని ప్రసాద్ తెలిపారు. పండగ సందర్భంగా హైదరాబాద్ నుంచి జిల్లాకు ప్రత్యేకంగా 346 ప్రత్యేక బస్సులు నడపడంతో ఉమ్మడి జిల్లాలోని 6 డిపోల్లో ఈ ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు. ప్రతి ఉద్యోగికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.