SDPT: జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) గరిమా అగ్రవాల్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని మైనారిటీ గురుకుల బాలుర పాఠశాల, కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల, కళాశాల ప్రాంగణంలోని తరగతి గదులను, భోజనశాలను, వంటశాలను, డార్మిటరీని తనిఖీ చేశారు. బాత్రూం టాయిలెట్లను కూడా తనిఖీ చేసి, పరిశుభ్రత పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.