ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్య, తాటి వెంకటేశ్వర్లు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.