ADB: ప్రజావాణిలో అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ అధికారి యువరాజ్ మార్మాట్ అన్నారు. సోమవారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ సమస్యలపై అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.