వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో న్యూమోనియా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. నవంబర్ 1 నుంచి 30 మధ్య 239 మంది చిన్నారులు న్యూమోనియాతో వార్డులో చేరారు. గత నెలలో 780 మంది పిల్లలు లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్తో ఓపీ సేవలు పొందారు. రోజుకు 7 నుంచి 8 మంది చిన్నారులు న్యూమోనియాతో చేరుతున్నారు.