SRD: స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఫుట్ బాల్ పోటీలు 7వ తేదీన సంగారెడ్డిలోని అంబేద్కర్ మైదానంలో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. బాల, బాలికల అండర్-14, 17 పోటీలు జరుగుతాయని చెప్పారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 99481 03605 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.