వనపర్తి పీర్లగుట్టకు చెందిన మొగిలి రవి (25) మేస్త్రి పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఈనెల 9న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల వద్ద వెతికిన ఫలితం లేకపోవడంతో తల్లి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిప్రసాద్ తెలిపారు.