BDK: గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం పూసల తండాలో ఉన్న తన సొంత వారసత్వ భూమి నుంచి సుమారు 3 గుంటల స్థలాన్ని ప్రభుత్వానికి ఉచితంగా అందజేస్తున్నట్లు సర్పంచ్ అజ్మీరా మహేశ్వరి ప్రకటించారు. పదవి చేపట్టిన మరుసటి రోజే సర్పంచ్ తన ఉదారతను చాటుకున్నారు. ప్రజా సేవలో భాగంగా ఆమె తీసుకున్న ఈ నిర్ణయంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.