KMM: క్షేత్రస్థాయి పరిస్థితిని ప్రతిబింబించేలా తుపాన్ నష్టంపై నివేదిక రూపొందించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. ఖమ్మం క్యాంపు కార్యాలయం నుంచి శనివారం ఆయన అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎక్కడా తప్పు జరగకుండా నష్టంపై నివేదికలు తయారుచేయాలని, ఏ పొరపాటు జరిగినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. DRO ఏ.పద్మశ్రీ తదితరులు ఉన్నారు.