KNR: ఆసరా చేయూత పింఛన్ల సాధన కోసం చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సైదాపూర్ వికలాంగుల హక్కుల పోరాట సంఘ అధ్యక్షులు జక్కోజు బిక్షపతి పెన్షన్ దారులకు పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ.. ఆసరా పింఛన్ల పెంపు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా మోసం చేస్తుందని, పింఛనుదార్లకు ఇవ్వడం లేదని మండిపడ్డారు.