MBNR: ఎంపీ డీకే అరుణ సోమవారం నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించిన ‘యూనిటీ ఫర్ 4కే రన్’లో పాల్గొంటారు. అనంతరం ప్రెస్ మీట్, విగ్రహ ప్రతిష్టాపన, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలలో పాల్గొంటారు. సాయంత్రం ఎస్ఈడీ లైట్ల ప్రారంభోత్సవం చేసి, రాత్రి జరిగే వివాహ వేడుకకు హాజరవుతున్నట్లు ఎంపీ కార్యాలయం తెలిపింది.