HYD: తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో BRSV ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్. వేల్పుకొండ వెంకటేశ్, తోనుపునురీ శ్రీకాంత్ గౌడ్, కార్యదర్శులు కాటం శివ, జి.రవి తదితరులు పాల్గొన్నారు.