PDPL: మంథని మున్సిపాలిటీ పరిధిలో రోడ్లపై పశువులను వదిలి పెడుతున్న యజమానులకు పురపాలక సంఘం విజ్ఞప్తి చేసింది. గోశాల సంరక్షణకు ఒక్కో ఆవుకు నెలకు రూ. 300 చెల్లిస్తే కపిళ గోశాలలో సంరక్షణ కల్పించనున్నట్లు కమిషనర్ మనోహర్ తెలిపారు. సంరక్షణ అవసరం లేని యజమానులు ఆవులను ఉచితంగా గోశాలకు అప్పగించవచ్చు. చనిపోతే ప్రత్యామ్నాయ ఆవు ఇవ్వబడుతుందని తెలిపారు.