JGL: రోడ్డుపై వాహనాలను డ్రైవర్లు జాగ్రత్తగా నడపాలని మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి సూచించారు. మేడిపల్లి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.