JGL: బీర్పూర్ మండలం తాళ్లధర్మారం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఉప వైద్యాధికారి డా. శ్రీనివాస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, ఫార్మసీ నిల్వ, అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో CHO ఖుద్దూస్, సూపర్వైజర్ తార, MLHP సీత, ఏఎన్ఎం, తదితరులు పాల్గొన్నారు.