NGKL: తలకొండపల్లి మండలంలోని రాంపూర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 3 రోజుల క్రితం ముగిశాయి. ఈ సందర్భంగా దేవాలయ పాలకవర్గం సభ్యులు, దేవాలయ ఈవో స్నేహలత శనివారం హుండీ లెక్కించారు. రూ.53,080 వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ పవన్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్యాంసుందర్ రెడ్డి, అర్చకులు నరసింహచారి పాల్గొన్నారు.