KMM: సత్తుపల్లి మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి ఇరుముడి కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. దుర్గాప్రసాద్ ఆహ్వానం మేరకు TGIDC ఛైర్మన్ మువ్వ విజయబాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి మాలధారులు శబరిమలై యాత్రకు తగు జాగ్రత్తలు వహించి భద్రంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.