MDK: వెల్దుర్తి మండలంలో ఆదివారం పోలీసులు రోడ్డు భద్రత మాసోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన రహదారులపై వాహనాల తనిఖీ చేపట్టారు. కుక్కునూరు చౌరస్తా వద్ద హెల్మెట్ ధరించి వాహనం నడుపుతున్న వాహనదారులకు ఎస్సై రాజు పువ్వులు ఇచ్చి శాలువాతో సన్మానించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.